హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ రోడ్ షోలు

హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ రోడ్ షోలు

21-11-2018

హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ రోడ్ షోలు

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు  ఈనెల 22 నుంచి 29 వరకు హైదరాబాద్‌ మహానగర పరిధి నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, సభల్లో పాల్గొంటారని హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం మూడు గంటల వరకు  టౌన్‌ హాలు సమావేశాల్లో, తర్వాత  రోడ్‌షోలలో మంత్రి ప్రసంగిస్తారని వెల్లడించారు. పార్టీ నేత పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 22న ఉప్పల్‌, కంటోన్మెంట్, 23న మహేశ్వరం, ఎల్బీనగర్‌, 24న జూబ్లీహిల్స్‌, సనత్‌నగర్‌, 26న గోషామహల్‌, ఖైరతాబాద్‌, 27న రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, 28న అంబర్‌పేట, ముషీరాబాద్‌, 29న కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లిలలో కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు.