తెలంగాణ ఎన్నికల బరిలో ఎంత మంది తెలుసా ?

తెలంగాణ ఎన్నికల బరిలో ఎంత మంది తెలుసా ?

23-11-2018

తెలంగాణ ఎన్నికల బరిలో ఎంత మంది తెలుసా ?

లెక్క తేలింది. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసే వారెవరో సృష్టత వచ్చింది. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు గురువారంతో గడువు ముగియడంతో రాష్ట్రంలో ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నారనే అంశం తేటతెల్లమైంది. పలు రాజకీయ పార్టీల్లో ఎప్పటి నుంచో టికెట్లు ఆశించిన భంగపడ్డ నేతలు అనేక మంది రెబల్స్‌ నామినేషన్లు దాఖలు చేయడంతో తీవ్ర గందరగోళం నెలకొన్న విషయం తెలిసిదే. ఈ నేపథ్యంలో తిరుగుబావుటా ఎగురవేసిన నేతలతో ఆయా రాజకీయ పార్టీల ముఖ్య నేతలు జరిపిన బుజ్జగింపులు ఫలించడంతో వారు ఈ రోజు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నేటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసే అభ్యర్థుల సంఖ్యను జిల్లాల వారీగా ఈసీ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 1821 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు వెల్లడించింది.