తెలంగాణలో రాహుల్, చంద్రబాబు రోడ్ షో

తెలంగాణలో రాహుల్, చంద్రబాబు రోడ్ షో

23-11-2018

తెలంగాణలో రాహుల్, చంద్రబాబు రోడ్ షో

మూడు దశాబ్దాల వైరాన్ని మరిచి కాంగ్రెస్‌, టీడీపీ సంయుక్తంగా తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగాయి. ఇరు పార్టీల అధినేతలు రాహుల్‌, చంద్రబాబు కలిసి ప్రచారంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో ఈ నెల 28,29 తేదీల్లో ప్రజా కూటమి అభ్యర్థుల తరపున వారి ప్రచార షెడ్యూలు ఖరారైంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో కలిసి ఉమ్మడి ప్రచారంతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపనున్నారు. 28న ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో జరిగే రోడ్‌ షోల్లో ఇద్దరు నేతలు ఒకే వేదికపై నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నేతలిద్దరూ హైదరాబాద్‌ చేరుకుంటారు. రాత్రికి నగరంలోనే బస చేస్తారు. 29న ఉదయం రాహుల్‌ గాంధీ కరీంనగర్‌లో ప్రచారం నిర్వహిస్తారు. చంద్రబాబుకు ఇతర పనులు ఉండడంతో హదరాబాద్‌లోనే ఉండనున్నారు. అదే రోజు రాహుల్‌, చంద్రబాబు కలిసి కేసీఆర్‌ నియోజకవర్గమైన గజ్వేల్‌ చేరుకుంటారు. అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి  తరపున ప్రచారం చేస్తారు. రాత్రికి హైదరాబాద్‌ చేరుకొని పలు నియోజకవర్గాల్లో నేతలిద్దరూ రోడ్‌ షోలో పాల్గొంటారని కాంగ్రెస్‌, టీడీపీ నేతలు తెలిపారు.