సోనియాగాంధీ పాత్ర మరువలేనిది : గద్దర్

సోనియాగాంధీ పాత్ర మరువలేనిది : గద్దర్

24-11-2018

సోనియాగాంధీ పాత్ర మరువలేనిది : గద్దర్

తెలంగాణను పసిబిడ్డగా.. సోనియాను తల్లితో పోల్చుతూ గద్దర్‌ భావోద్వేగంతో చేసిన ప్రసంగం సభకు హాజరైన ప్రజలను ఆకట్టుకుంది. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదింప చేయటంలో సోనియాగాంధీ పాత్ర మరువలేదని గద్దర్‌ అన్నారు. కాలాన్ని పార్లమెంటులో బంధించి, ప్రత్యేక తెలంగాణను ఇచ్చారని కొనియాడారు. తెలంగాణ పసిబిడ్డను పాలకుల చేతిలో పెడితే, పాలకులు పాలుదాపకుండా జోలపాటవాడిర్రు. మళ్లీ ఇప్పుడు వచ్చి ఆ తెలంగాణ పసిబిడ్డను తన ఒడిలోకి తీసుకొని దీవించడానికి సోనియా వచ్చారు అంటూ సోనియాకు ధన్యవాదాలు తెలిపారు. చివరలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ గద్దర్‌ పాడిన పాటకు సభకు వచ్చిన జనం కూడా గొంతు కలిపారు.