కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ కు అరుదైన అవకాశం

కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ కు అరుదైన అవకాశం

24-11-2018

కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ కు అరుదైన అవకాశం

టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్‌, ఖైరతాబాద్‌ అభ్యర్థి కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రావణ్‌కు అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ఒకే వేదికపై తల్లీ కుమారులైన యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హిందీ ప్రసంగాలను తెలుగులో అనువదించారు. మేడ్చల్‌లో జరిగిన కాంగ్రెస్‌ బహిరంగ సభలో దాసోజు మరోమారు అనువాదకుడిగా వ్యవహరించారు. సోనియా, రాహుల్‌ గాంధీల భావోద్వేగాలను తన ప్రసంగంలో ప్రతిబింబించేలా దాసోజు అనువాదం చేశారు. తొలుత సోనియా, ఆ తరువాత రాహుల్‌ ప్రసంగాన్ని అనువదించారు. సోనియా మాట్లాడిన వెంటనే శ్రవణ్‌ అనువదించడం, శ్రవణ్‌ ఆపిన వెంటనే సోనియా మళ్లీ మాట్లాడడం ఎక్కడా తడ బాటు లేకుండా సాగిపోయింది. సోనియా ప్రసంగించి కూర్చున్న తరువాత ఆమె వద్దకు వెళ్లి దాసోజు పాదాబివందనం చేశారు. సోనియా ప్రసంగం తరువాత రాహుల్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు అనువాదకుడేరని ఉత్తమ్‌ను అడిగ్గా.. ఆయన వెంటనే శ్రవణ్‌ను పంపించారు. రాహుల్‌ ప్రసంగాన్ని కూడా తడబడకుండా శ్రవణ్‌ అనువదించడం విశేషం. అనంతరం రాహుల్‌, శ్రవణ్‌తో కరచాలనం చేసి అభినందించారు.