నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తాం : సోనియా

నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తాం : సోనియా

24-11-2018

నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తాం : సోనియా

నేను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరికీ ఈ వేదిక నుంచి వాగ్దానం చేస్తున్నాను. ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాం. అలాగే ఆ రోజు (రాష్ట్ర విభజన) చేసిన వాగ్దానాలన్నిటీని అమలు చేస్తాం అని యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల జీవితాలు బాగుండాలని తాము ఆరోజు రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకొన్నాం. ఆంధ్ర ప్రజల క్షేమాన్ని పట్టించుకున్నామన్నారు. దానికోసమే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన రోజున, పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నిర్ణయం తీసుకుని, ఆ విషయం ప్రకటించామని సోనియాగాంధీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె రాష్ట్రంలోని మేడ్చల్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఉద్వేగంతో ప్రసంగించారు. తెలంగాణ వర్తమాన పరిస్థితులను గురించి ప్రస్తావిస్తూ, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎట్లయితే నాడు కొట్లాడినారో అదే స్ఫూర్తితో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటూ తీవ్ర సర్వం వినిపించారు.