కాంగ్రెస్ లో చేరిన ఎంపీ కొండా

కాంగ్రెస్ లో చేరిన ఎంపీ కొండా

24-11-2018

కాంగ్రెస్ లో చేరిన ఎంపీ కొండా

తెలంగాణ రాష్ట్ర సమితికి రాజీనామా చేసిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మేడ్చల్‌ సభలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీల సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి సైతం ఇదే సభలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. విశ్వేశ్వర్‌రెడ్డి ఇటీవలే టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. అనంతరం ఢిల్లీకి వెళ్లి రాహుల్‌గాంధీని కలిసి వచ్చారు. మేడ్చల్‌లో సభ సందర్భంగా ఆయన వేదికపైకి చేరుకొని రాహుల్‌, సోనియాల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఈ వేదిక మీదకు వచ్చి కాంగ్రెస్‌ పార్టీ కండువాను కప్పుకున్నారు. వీరితో పాటు మహబూబ్‌నగర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ జగదీశ్‌రెడ్డి, జనగామ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, జహీరాబద్‌ టీడీపీ నేత నరోత్తంరెడ్డి తదితరులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.