పార్లమెంట్ నుంచి.... తెలంగాణ అసెంబ్లీకి

పార్లమెంట్ నుంచి.... తెలంగాణ అసెంబ్లీకి

24-11-2018

పార్లమెంట్ నుంచి.... తెలంగాణ అసెంబ్లీకి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. ఈ దఫా ఎన్నికల్లో గతంలో ఎంపీలు (పార్లమెంట్‌ సభ్యులు)గా ఉన్న వారికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడం విశేషం. సాధారణంగా ఎంపీగా ఎన్నికైనవారు దేశ రాజకీయాల్లో చురుగ్గా ఉంటారు. అయితే మారుతున్న రాజకీయాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఉండేందుకు ప్రాధానమిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, సర్వే సత్యనారాయణ, మల్లురవి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బలరాంనాయక్‌, తదితరులు పోటోలో ఉన్నారు. వీరిలో సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్‌లు కేంద్రమంత్రులుగా కూడా వ్యవహరించడం విశేషం.

 సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నుంచి సర్వే సత్యనారాయణ, జడ్చర్ల శాసన సభస్థానం నుంచి మల్లురవి, మహబూబాబాద్‌ నియోజకవర్గం నుంచి బలరాం నాయక్‌, కరీంనగర్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి పొన్నం ప్రభాకర్‌, మునుగోడు నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు.