సుహాసినికి మద్దతుగా సునీత ప్రచారం

సుహాసినికి మద్దతుగా సునీత ప్రచారం

27-11-2018

సుహాసినికి మద్దతుగా సునీత ప్రచారం

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత ప్రచారం నిర్వహించారు. కూకట్‌పల్లిలో సుహాసినితో కలిసి రోడ్‌ షోలో పాల్గొన్నారు. నందమూరి బిడ్డను భారీ మెజారిటీతో గెలిపించాలని కూక్‌ట్‌పల్లి ప్రజలను కోరారు. సుహాసిని మద్దతుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పరిటాల సునీత అన్నారు. కూకట్‌పల్లి టీడీపీకి కంచుకోట అని పేర్కొన్నారు. సుహాసిని గెలుపు కోసం అందరూ ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ సమస్యలు, మహిళల కష్టాల పరిష్కారంలో సుహాసిని ముందుంటారనే నమ్మకం అందరికీ ఉందని వెల్లడించారు.