నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ ఏం చేసింది : ప్రధాని

నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ ఏం చేసింది : ప్రధాని

27-11-2018

నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ ఏం చేసింది : ప్రధాని

ఎంతోమంది బలిదానాల తర్వాత తెలంగాణ ఏర్పడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజమాబాద్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. కాసేపు తెలుగులో ప్రసంగించి ప్రజలను మోదీ ఆకట్టుకున్నారు. నాలుగున్నరేళ్లలో ఏం చేశారని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అడిగే సందర్భమిదని అన్నారు. హామీల అమలులో విఫలమైన కేసీఆర్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మోదీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్‌ బాటలోనే టీఆర్‌ఎస్‌ వెళ్తోందని ఆయన విమర్శించారు. నిజమాబాద్‌ను లండన్‌ చేస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారని, కానీ ఇక్కడ కనీస వసతులు కూడా లేవని ఎద్దేవా చేశారు. వెనుకబడిన రాష్ట్రాల్లో ఉన్నట్టుగానే నిజామాబాద్‌లో పరిస్థితులు ఉన్నాయన్నారు. గోదావరి, మంజీరా, కృష్ణా నదులు ప్రవహించే పుణ్యభూమిని, రజాకార్ల ఆగడాలను ధైర్యంగా ఎదిరించి భూమి ఇదని అన్నారు నిజామాబాద్‌కు చెందిన గిరిజన పుత్రులు, ఎవరెస్ట్‌పై దేశ జెండాను ఎగరవేశారని మోదీ కొనియాడారు.