టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన గొట్టిముక్కల పద్మారావు

టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన గొట్టిముక్కల పద్మారావు

27-11-2018

టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన గొట్టిముక్కల పద్మారావు

టీఆర్‌ఎస్‌ కు రాజీనామా చేసిన కూకట్‌పల్లి నేత గొట్టిముక్కల పద్మారావు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఆయన విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నందమూరి సుహాసిని గెలుపు కోసం గొట్టిముక్కల ప్రచారం చేయనున్నారు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన విషయం గురించి మాట్లాడుతూ పార్టీని తన ఇల్లులా, కేసీఆర్‌ తన తండ్రిలా భావించానని వ్యాఖ్యానించారు. తనతోపాటు చాలామందికి పార్టీలో తీరని అన్యాయం జరిగినా ఓపికగా  మార్పుకోసం ఎదురుచూశామన్నారు. కేసీఆర్‌ తెలంగాణ వాదాన్ని పూర్తిగా మరిచి పోయారని అన్నారు. పార్టీ పక్కదారి పడుతోందని, ఇప్పట్లో గాడిలో పడే పరిస్థితి కనిపించడం లేదని భావించి తన క్రియా శీలక సభ్యత్వానికి, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి పదవికి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.