తెలంగాణలో చంద్రబాబు పర్యటన

తెలంగాణలో చంద్రబాబు పర్యటన

27-11-2018

తెలంగాణలో చంద్రబాబు పర్యటన

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తెలంగాణ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. బుధవారం (ఈ నెల 28న) మధ్యాహ్నం 1 గంటకు అమరావతిలో బయలుదేరి హెలికాప్టర్‌ ద్వారా 2 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. 2:30 గంటలకు ఖమ్మంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహల్‌ గాంధీతో కలిసి బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం 5:30 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా హైదరాబాద్‌కు చేరుకుంటారు. అమీర్‌పేట సత్యం థియేటర్‌ సర్కిల్‌ మళ్లీ రాహుల్‌తో కలిసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం 6:45 గంలకు నాంపల్లిలోని అసీఫ్‌నగర్‌లో రాహుల్‌తో పాటు బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 7:45 గంటలకు హైదరాబాద్‌లోని నివాసానికి చేరుకుంటారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ పర్యవేక్షిస్తున్నారు.