తెలంగాణలో బాలయ్య పర్యటన ఖరారు

తెలంగాణలో బాలయ్య పర్యటన ఖరారు

28-11-2018

తెలంగాణలో బాలయ్య పర్యటన ఖరారు

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తరపున నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారైంది. ఐదు రోజుల పాటు బాలయ్య ప్రచారంలో పాల్గొననున్నారు. నవంబర్‌ 30న కూకట్‌పల్లిలో నందమూరి సుహాసినీకి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. డిసెంబర్‌ 1న శేరిలింగంపల్లి, డిసెంబర్‌ 2న ఖమ్మం, సత్తుపల్లి, ఆశ్వరావుపేట నియోజకవర్గాల్లో బాలకృష్ణ ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే డిసెంబర్‌ 3న మహబూబ్‌నగర్‌, మక్తల్‌, 4న రాజేంద్రనగర్‌, ఇబ్రహీంపట్నం, ఉప్పల్‌, సనత్‌నగర్‌ అభ్యర్థుల తరపున బాలయ్య ప్రచారం చేయనున్నారు.