వచ్చేది తమ ప్రభుత్వమే : ఉత్తమ్

వచ్చేది తమ ప్రభుత్వమే : ఉత్తమ్

28-11-2018

వచ్చేది తమ ప్రభుత్వమే : ఉత్తమ్

మహబూబ్‌నగర్‌ జిల్లాలో అన్ని స్థానాలు గెలుస్తామని, డిసెంబర్‌ 11న వచ్చేది తమ ప్రభుత్వమేనని టీపీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం కోస్గిలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఈ ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోలేదన్నారు. ఎన్నో త్యాగాలు చేసిన విద్యార్థులకు కేసీఆర్‌ ప్రభుత్వం న్యాయం చేయలేదని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే రేషన్‌లో ఇచ్చే దొడ్డు బియ్య స్థానంలో ఏడు కిలోల సన్నబియ్యం ఇస్తామన్నారు. ఏడాదికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం అని ఉత్తమ్‌ తెలిపారు.