తెలంగాణలో ప్రజాకూటమి విజయం : చంద్రబాబు

తెలంగాణలో ప్రజాకూటమి విజయం : చంద్రబాబు

29-11-2018

తెలంగాణలో ప్రజాకూటమి విజయం : చంద్రబాబు

దేశంలో రెండే రెండు ఫ్రంట్‌లు ఉంటాయి. ఒకటి బీజేపీ అయితే, రెండోది బీజేపీని వ్యతిరేకించే ఫ్రంట్‌ అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్‌లో ప్రజాకూటమి అభ్యర్థికి మద్దతుగా నిర్వహించిన రోడ్డు షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కాంగ్రెస్‌, టీడీపీ, మమతా బెనర్జీ అంతా రెండో ఫ్రంట్‌లో భాగంగా ఉంటారు. మరి కేసీఆర్‌ ఏ ఫ్రంట్‌లో ఉంటారు. బీజేపీతో ఉంటారా? బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడే ఫ్రంట్‌లో ఉంటారా? సమాధానం చెప్పాలని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని, ఎస్పీలపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో భద్రత లేకుండా పోయిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతోనే టీడీపీ, కాంగ్రెస్‌ కలిశాయని అన్నారు. తెలంగాణ ప్రజాకూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సైబరాబాద్‌ను అభివృద్ధి చేసిన తనపై విమర్శలు చేయడానికే కేసీఆర్‌ ముందుకొస్తారు తప్ప విభజన హామీల్లో తెలంగాణకు రావాల్సిన వాటి గురించి కేంద్రాన్ని అడగడం లేదని విమర్శించారు.