ప్రగతిభవన్ ను ప్రభుత్వ ఆస్పత్రి చేస్తాం

ప్రగతిభవన్ ను ప్రభుత్వ ఆస్పత్రి చేస్తాం

30-11-2018

ప్రగతిభవన్ ను ప్రభుత్వ ఆస్పత్రి చేస్తాం

ధనిక రాష్ట్రమైన తెలంగాణలో అభివృద్ధి సీఎం కేసీఆర్‌ వల్లనే కుంటుపడిందని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణ విమర్శించారు. పార్టీ రూపొందించిన ఎన్నికల ప్రచార గీతాల సీడీని ఆయన ఆవిష్కరించారు. పాలనను గాలికొదిలేసిన కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో విలాసవంతమైన జీవనం గడుపుతున్నారని, అది పైరవీ భవన్‌గా మారిందని ఆరోపించారు. ప్రజాకూటమి అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌ను ప్రభుత్వాసుపత్రిగా మారుస్తుందని ఆయన ప్రకటించారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, ప్రజా కూటమి అవసరం ఏమిటో అందరికీ తెలిసేలా ప్రచారగీతాలు రూపొందాయన్నారు. గీత రచయిత అనంత శ్రీరామ్‌తో పాటు సంగీతం, గాత్ర దానం చేసిన వందేమాతరం శ్రీనివాస్‌ను అభినందించారు. సీడీలో ఐదు టీడీపీ, ఒకటి ప్రజాకూటమికి చెందిన గీతాలు ఉన్నాయన్నారు.