టీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ

టీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ

30-11-2018

టీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ

ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన రోజే సమ్మయ్య తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమయ్యింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపించారు. కేసీఆర్‌ కాగజ్‌నగర్‌లో పర్యటించినప్పటికీ తనకు సమాచారం లేదన్నారు. ఆ ఆవేదనతో పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడిన తనను కాదని బీఎస్పీ నుంచి వచ్చిన కోనప్పను చేర్చుకున్నారని, ఆయనకే టికెట్‌ ఇవ్వడం వల్ల తాను పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. రెండు రోజుల్లో తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానన్నారు.