ఫలించిన రేవంత్ రెడ్డి కోరిక

ఫలించిన రేవంత్ రెడ్డి కోరిక

30-11-2018

ఫలించిన రేవంత్ రెడ్డి కోరిక

కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి భద్రతపై హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అప్పీల్‌ చేసింది. రేవంత్‌రెడ్డికి భద్రత కల్పించాలని ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కేంద్రం హైకోర్టును కోరింది. కేంద్రం అప్పీల్‌ను న్యాయస్థానం అంగీకరించింది. రేవంత్‌రెడ్డికి భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. రేవంత్‌రెడ్డికి 4 ప్లస్‌ 4 భద్రత, ఎస్కార్ట్‌ కల్పించాలని, ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు భద్రత కొనసాగించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

తనకు భద్రత కల్పించాలని రేవంత్‌ రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉందని, నిరంతరం తన వెంట నలుగురు భద్రతా సిబ్బంది ఉండేలా చూడాలని విన్నవించారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత కేంద్రం భద్రత కల్పించాలని పేర్కొంటూ సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దీనిపై తాజాగా కేంద్ర హోంశాఖ హైకోర్టులో అప్పీల్‌ చేసింది. స్థానిక నేతల భద్రత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, రేవంత్‌కు కేంద్రం భద్రత కల్పించాలన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవరించాలని కోరింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పును వెలువరించింది. రేవంత్‌రెడ్డికి భద్రతను రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలని ఆదేశించింది. 4+4 భద్రతతోపాటు, ఎస్కార్ట్‌ కల్పించాలని, ఇది ఎన్నికల ఫలితాలు వెలవడే వరకు కొనసాగాలని కోర్టు పేర్కొంది.