అవసరమైతే ఏపీ రాజకీయాల్లోకి : కేటీఆర్

అవసరమైతే ఏపీ రాజకీయాల్లోకి : కేటీఆర్

01-12-2018

అవసరమైతే ఏపీ రాజకీయాల్లోకి : కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా చంద్రబాబు అంతుచూసేందుకు అవసరమయితే ఆంధ్రప్రదేశ్‌లోనూ వేలుపెడతామని ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో అనవసరంగా వేలు పెట్టారన్నారు. నాలుగు బిల్డింగులు కట్టి చంద్రబాబే అంత ఫోజు కొడితే అసాధ్యమనుకున్న తెలంగాణను తెచ్చిన కేసీఆర్‌కు ఎంతుండాలని కేటీఆర్‌ ఎద్దేవా ఏశారు. తాము కూడా ఏపీ రాజకీయాల్లో వేలుపెడతామని సృష్టం చేశారు. రాజకీయంగా చంద్రబాబు సంగతి తెలుస్తామన్నారు. ఆ దిశగా భవిష్యత్తులో నిర్ణయం ఉంటుందన్నారు. నేనేం తప్పుచేశానని చంద్రబాబు అంటున్నారు. నువ్వు తప్పు చేయలేదా? నువ్వు సుద్దపూసవా? కూకట్‌పల్లిలో నందమూరి సుహాసినికి ఎందుకు సీటిచ్చారు. నందమూరి కుటుంబానికి రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేసేందుకు కాదా? మాట్లాడితే 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అంటుంటారు. సెల్ఫ్‌ డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబుకు రికార్డు ఉంది. అవసరం అయితే రేపటి రోజున రాజకీయంగా చంద్రబాబు అంతు చూసేందుకు ఏపీలోనూ వేలు పెడతాం అని కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌లో నాటకాలాడితే ఆయనను అమరావతికి తరిమికొట్టామన్నారు. ఈ ఎన్నికల్లో కూడా చంద్రబాబును ఆయన పార్టీని తెలంగాణ సమాజం తరికొడుతుందనే విశ్వాసం తనకు ఉందన్నారు. కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, ఆ ఫ్రంట్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో తమ పట్టు చూపెడతామన్నారు.