హైదరాబాద్ ను నిర్మించానని ఎక్కడా చెప్పలేదు

హైదరాబాద్ ను నిర్మించానని ఎక్కడా చెప్పలేదు

01-12-2018

హైదరాబాద్ ను నిర్మించానని ఎక్కడా చెప్పలేదు

హైదరాబాద్‌ను నిర్మించానని ఎక్కడా చెప్పలేదని, సైబరాబాద్‌ను తానే నిర్మించానని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సృష్టం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పెత్తనం చేయడానికి తాను రాలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, కేసీఆర్‌ సర్కార్‌ పాలనా తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన పాలనలో ఘనంగా చెప్పుకునే పనిని కేసీఆర్‌ ఒక్కటైనా చేశారా? అని ప్రశ్నించారు. తన కృషి వల్లే హైదరాబాద్‌ దేశంలోనే అత్యుత్తమ నగరంగా ఎదిగిందన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టాను. ప్రపంచమంతా తిరిగి సైబరాబాద్‌కు కంపెనీలు తీసుకొచ్చా. ఎయిర్‌పోర్టు, ఔటర్‌రింగ్‌రోడ్డు, హైటెక్‌సిటీ టీడీపీ హయాంలోనే వచ్చాయి. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే కాంగ్రెసతో కలిశాం. ప్రధాని మోదీ పాలనలో దేశంలోని అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ఆర్బీఐని కూడా మోదీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. నోట్ల రద్దుతో సామాన్యులకు ఇబ్బందులపాలు చేశాయి. ఐదేళ్లు ఈ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలి అని చంద్రబాబు సూచించారు.