ఆయన చరిత్ర చెరిపేయాలంటే... హైటెక్ సిటీ తీసేయాలి

ఆయన చరిత్ర చెరిపేయాలంటే... హైటెక్ సిటీ తీసేయాలి

03-12-2018

ఆయన చరిత్ర చెరిపేయాలంటే... హైటెక్ సిటీ తీసేయాలి

మీది లాటరీ. చంద్రబాబుది హిస్టరీ. చంద్రబాబు చరిత్రను చెరిపేయాలనుకొంటే దునియాపై మూకుడు కప్పేయడమే. నగరంలో 15 ఏళ్ల క్రితమే రాళ్ల గుట్టలపై ఐటీ సామ్రాజ్యాన్మి నిర్మించి ప్రపంచ మేధావులను రప్పించిన ఘనత చంద్రబాబుది. ఆయన చరిత్ర చెరిపేయాలన్నా, పేజీలు చించేయాలన్నా హైటెక్‌ సిటీ తీసేయాలి. ఆ దమ్ము మీకుందా? ఫ్లైఓవర్లు మాయం చేయాలి.. ఆ దైర్యం మీకుందా? రింగురోడ్డును అదృశ్యం చేయాలి. శంషాబాద్‌ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టు తీసేయాలి. బిడ్డా తీసేసి చూడండి. చంద్రబాబు కట్టించిన స్పోర్ట్స్‌ సెంటర్లపై బట్టలు కప్పాలి. కప్పి చూడండి అంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కట్టిన కట్టడాల్లో మీటింగ్స్‌ పెట్టుకొని ఆయన్నే విస్మరిస్తున్నారు. మీ గల్లీ బుద్దులు చూస్తుంటే జాలేస్తుందిరా బయ్‌ అని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్‌ కాలనీలో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సైబరాబాద్‌ను సృష్టించింది చంద్రబాబేనన్నారు. తెలంగాణలో భూస్వాములు, పెత్తందారులు, గడీల వ్యవస్థను రూపుమాపింది తెలుగుదేశమేనని గుర్తు చేశారు. ఎందరో త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణలో ఉద్యోగాలు, ఉపాధి లేక ఆత్మహత్యలకు ప్పాలడుతున్నారని అన్నారు. అమరవీరులు, విద్యార్థుల త్యాగాలను గుర్తించాల్సిన అవసరముందని చెప్పారు.