తెలుగుజాతి కలిస్తే ఆయన అడ్రస్ గల్లంతు

తెలుగుజాతి కలిస్తే ఆయన అడ్రస్ గల్లంతు

03-12-2018

తెలుగుజాతి కలిస్తే ఆయన అడ్రస్ గల్లంతు

తెలుగు జాతి ఐక్యతకు కేసీఆర్‌ అడ్డంకి అని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట, ఉప్పల్‌, ఎల్బీనగర్‌ నియోజకవర్గాల్లో ప్రజాఫ్రంట్‌ అభ్యర్థులకు మద్దతుగా  ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుజాతి కలిస్తే తన అడ్రస్‌ గల్లంతవుతుందని కేసీఆర్‌ భయపడుతున్నారని పేర్కొన్నారు. గతాన్ని మరిచిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఆటలు సాగబోవని హెచ్చరించారు. కేసీఆర్‌, తన తనయుడు కేటీఆర్‌ బెదిరింపులకు, దబాయింపులకు భయపడేల ప్రసక్తే లేదని, అవసరమైతే తాడోపేడో తేల్చుకుంటామని అన్నారు. హైదరాబాద్‌ను తాను అభివృద్ధి చేసింది కేసీఆర్‌, కేటీఆర్‌ కోసం కాదన్నారు. మెట్రో రైలు ఆలస్యానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. మెట్రో గరిష్ట టికెట్టు ధరను తాను 16గా నిర్ణయిస్తే ఇప్పుడు రూ.60 ఉందని ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా టీఆర్‌ఎస్‌ ఎన్ని అక్రమాలకు పాల్పడ్డా కనీసం పత్రికల్లో వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.