టీఆర్ఎస్ కు దుబ్బాక గుడ్ బై

టీఆర్ఎస్ కు దుబ్బాక గుడ్ బై

03-12-2018

టీఆర్ఎస్ కు దుబ్బాక గుడ్ బై

టీఆర్‌ఎస్‌ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాంనబీ ఆజాద్‌ సమక్షంలో కాంగ్రెస్‌ గూటికి చేరారు. దీంతో తొమిదేళ్లకు దుబ్బాక సొంతగూటికి చేరినట్టుయింది. కొద్ది రోజులుగా ఆయన టీఆర్‌ఎస్‌ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు తప్పించడంతో పాటు ఎమ్మెల్యే టిక్కెట్‌ నిరాకరించడం, కార్పొరేషన్‌ పదవి సైతం ఇవ్వకపోవడంతో కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. నల్లగొండలో రోడ్డు షోకు వచ్చిన గులాంనబీ ఆజాద్‌.. దుబ్బాక ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్‌ కండువా కప్పి ఆయనను పార్టీకిలో ఆహ్వానించారు.