కేసీఆర్ ది లాటరీ...చంద్రబాబుది హిస్టరీ : బాలకృష్ణ

కేసీఆర్ ది లాటరీ...చంద్రబాబుది హిస్టరీ : బాలకృష్ణ

04-12-2018

కేసీఆర్ ది లాటరీ...చంద్రబాబుది హిస్టరీ : బాలకృష్ణ

తెలుగు రాష్ట్రాలు వేరుగా ఉన్నా, తెలుగు ప్రజలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణలో ప్రజాకూటమి తరపున ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రముఖ సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. మలక్‌పేట ప్రజాకూటమి టీడీపీ అభ్యర్థి మహ్మద్‌ ముజఫర్‌ అలీఖాన్‌తో కలిసి రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ మీద చంద్రబాబు తనదైన ముద్ర వేశారన్నారు. ఏదో నాలుగు గొర్రెలను తీసుకొచ్చి మేము పీకినాం అంటే కుదరదన్నారు. చంద్రబాబు బుద్ధిగా ఆయన పని ఆయన చేసుకునేటోడు. ఫాంహౌస్‌కు పోయి పండేటోడు కానేకాదన్నారు. ఇక మోదీ సార్‌ ఆయన మనకు కనబడడని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ది లాటరీ అని.. చంద్రబాబుది హిస్టరీ అని అన్నారు. మంత్రి కేటీఆర్‌ చంద్రబాబును బెదిరిస్తూ రేపు ఆంధ్రలో జరగబోయే ఎన్నికల్లో మేం వేలు పెడతానంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ ఆంధ్రకు వస్తావా? రా దమ్ముంటే చూసుకుందాం అంటూ సవాల్‌ విసిరారు. అయినా ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.