తెలంగాణ ఎన్నికలో ఏ పార్టీకి మా మద్దతు లేదు

తెలంగాణ ఎన్నికలో ఏ పార్టీకి మా మద్దతు లేదు

05-12-2018

తెలంగాణ ఎన్నికలో ఏ పార్టీకి మా మద్దతు లేదు

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏ రాజకీయ పార్టీకిగాని, వ్యక్తికిగాని మద్దతు ఇవ్వడం లేదని ఆ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఓటర్లకు తప్పుడు సంకేతాలు పంపేలా ఆ పార్టీ తెలంగాణ జనరల్‌ సెక్రటరీగా ఉన్న కే.శివకుమార్‌ ఒక ప్రకటన చేశాడని, పార్టీ లెటర్‌హెడ్‌ ఉపయోగించాడని పేర్కొన్నది. ఆయన ఇచ్చిన ప్రకటనను క్రమశిక్షణ రాహిత్యంగా భావించి పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించినట్టు తెలిపింది.