తెలంగాణలో వాళ్లకే ఓటెయ్యండి : పవన్

తెలంగాణలో వాళ్లకే ఓటెయ్యండి : పవన్

05-12-2018

తెలంగాణలో వాళ్లకే ఓటెయ్యండి : పవన్

తెలంగాణ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలకు తన సందేశాన్ని అందించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. నా తెలంగాణ కోటీ రతనాల వీణ అంటూ గర్జించిన దాశరథి కృష్ణమాచార్య కవిత్వంతో పవన్‌ తన వీడియో సందేశాన్ని ప్రారంభించారు. పోరాట వీరుల స్ఫూర్తితో తెలంగాణ యువత స్వరాష్ట్రం సాధించుకుందన్నారు. ముందస్తు ఎన్నికలు రావడంతో జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేకపోయిందని చెప్పారు. తెలంగాణ సాధించామన్నవాళ్లు ఒకవైపు, తెలంగాణ ఇచ్చామన్నవాళ్లు మరోవైపు ఉన్నారని, ఇప్పుడు తాను చెప్పేది ఒకటేనని.. ఎక్కువ పారదర్శకతతో, అవినీతి రహిత పాలన ఎవరు అందించగలరో వారికే ఓటేయ్యండని పిలుపునిచ్చారు. జై తెలంగాణ.. జై హింద్‌ నినాదాలతో తన ప్రసంగాన్ని పవన్‌ ముగించారు.