కియో మోటార్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

కియో మోటార్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

06-12-2018

కియో మోటార్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

ఆటో మొబైల్‌ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ కీలక అడుగు వేసింది. రాబోయే తరం పర్యావరణ రవాణాపై చంద్రబాబు సమక్షంలో కియో మోటార్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ ఎలక్ట్రికల్‌ కార్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్లకు ఒకసారి ఛార్జింగ్‌ చేసుకుంటే 455 కిలోమీటర్ల వరకు ప్రయాణం సాగించవచ్చు. ఇందుకోసం విజయవాడలో ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలుత ఏపీలోని ఆకర్షణీయ పట్టణాలు, నగరాలలో పర్యావరణహితమైన ఆధునిక రవాణా వ్వవస్థకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.