ఆ 13 నియోజకవర్గాల్లో 4 గంటల వరకే పోలింగ్‌

ఆ 13 నియోజకవర్గాల్లో 4 గంటల వరకే పోలింగ్‌

06-12-2018

ఆ 13 నియోజకవర్గాల్లో 4 గంటల వరకే పోలింగ్‌

తెలంగాణలో మావోయిస్టు ప్రభావం ఉండే ప్రాంతాల్లో పోలింగ్‌ను సాయంత్రం 4 గంటలకే ముగించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ముఖ్యంగా ములుగు, భూపాలపల్లి, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, సిర్పూర్‌, అసిఫాబాద్‌, మంథని, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో గంట ముందుగానే పోలింగ్‌ను ముగించనున్నారు. అయితే సాధ్యమైనంత ఎక్కువ పోలింగ్‌ జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.