ఎన్నికల విధుల్లో 90వేల మంది పోలీసులు

ఎన్నికల విధుల్లో 90వేల మంది పోలీసులు

06-12-2018

ఎన్నికల విధుల్లో 90వేల మంది పోలీసులు

 
 
పోలింగ్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ, గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధుల్లో 90వేల మంది పోలీసులు  బందోబస్తులో పాల్గొంటున్నారు. పోలీస్ శాఖలో హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు సుమారు 50 వేల మంది బందోబస్తులో పాల్గొంటున్నారు. అటు పొరుగు రాష్ట్రాల నుంచి 20 వేల మంది, కేంద్ర బలగాల నుంచి 20వేల మంది తెలంగాణ ఎన్నికల్లో విధులు నిర్వహించనున్నారు. ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించడం నుంచి.. తిరిగి స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించేవరకు 90 వేల మంది పోలీసులు డ్యూటీలో ఉంటారు. ఎన్నికల సిబ్బందికి రక్షణగా ఉంటారు.  ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది.