సాయికృష్ణ వైద్య ఖర్చులకు సహకారమందిస్తాం

సాయికృష్ణ వైద్య ఖర్చులకు సహకారమందిస్తాం

08-01-2019

సాయికృష్ణ వైద్య ఖర్చులకు సహకారమందిస్తాం

దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడి అమెరికా ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్న తమ కొడుకును కాపాడాలంటూ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  కేటీఆర్‌ను సాయికృష్ణ తల్లిదండ్రులు కలిశారు. సాయికృష్ణ పరిస్థితి గురించి ఆరా తీశారు. సాయికృష్ణకు ప్రాణాపాయం తప్పిందని, ఇంకా పలు ఆపరేషన్లు చేయాలని తల్లిదండ్రులు చెప్పారు. దీనిపై స్పందించిన కేటీఆర్‌ సాయికృష్ణ వైద్య ఖర్చులకు, తల్లిదండ్రులు అమెరికా వెళ్లేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. దీంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ నెల 3న అమెరికాలోని మిషిగన్‌ రాష్ట్రం డెట్రాయిట్‌లో దుండగుల చేతిలో గాయపడ్డ మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన పూస సాయికృష్ణ, తల్లిదండ్రులు పూస ఎల్లయ్య-శైలజ ఆవేదన ఇది. తమ కొడుక్కి మెరుగైన చికిత్స అందించడంతోపాటు, ఆర్థిక సాయం చేయాలని విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో పాటు భారత, అమెరికా రాయబార కార్యాలయాలు, సీఎం కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు వారు లేఖలు రాశారు.