అమెరికా వర్సిటీతో అగ్రివర్సిటీ ఒప్పందం

అమెరికా వర్సిటీతో అగ్రివర్సిటీ ఒప్పందం

09-01-2019

అమెరికా వర్సిటీతో అగ్రివర్సిటీ ఒప్పందం

కచ్చితత్వ వ్యవసాయ పద్దతులు, భూసార సంరక్షణ, నీటి యాజమాన్యంలో పరస్పర సహకారంతో పనిచేయాలని అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడాతో కలిసి ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పని చేయనుంది. ఈ మేరకు జయశంకర్‌ వర్సిటీ వీసీ డాక్టర్‌ ప్రవీణ్‌రావు సమక్షంలో రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌, ఫ్లోరిడా వర్సిటీ ప్రతినిధి డాక్టర్‌ రమేశ్‌రెడ్డి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నారు. కాగా, ఆర్గానిక్‌ వ్యసాయంతో పరస్పర సహకారం కోసం జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీతో హరిద్వార్‌లోని పతంజలి బయో రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఒప్పందం కుదుర్చుకుంది.