సాయికృష్ణ కుటుంబ సభ్యులకు 10లక్షల చెక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

సాయికృష్ణ కుటుంబ సభ్యులకు 10లక్షల చెక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

10-01-2019

సాయికృష్ణ కుటుంబ సభ్యులకు 10లక్షల చెక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

అమెరికాలో కాల్పులకు గురైన మహబూబాబాద్‌కు చెందిన సాయికృష్ణ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. సాయికష్ణకు అండగా ఉంటామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా సాయికృష్ణ  తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. సాయికష్ణ తల్లిదండ్రులు అమెరికా వెళ్లేందుకు వీసా ఏర్పాట్లను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. అలాగే.. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ట్రీట్‌మెంట్‌, కుటుంబ సభ్యుల ప్రయాణ ఖర్చుల నిమిత్తం పది లక్షల రూపాయల చెక్‌ను సాయికష్ణ తల్లిదండ్రులకు అధికారులు అందజేశారు.