హెచ్ ఎండీఏ కమిషన్ జనార్దన్ రెడ్డి అమెరికా పర్యటన

హెచ్ ఎండీఏ కమిషన్ జనార్దన్ రెడ్డి అమెరికా పర్యటన

10-01-2019

హెచ్ ఎండీఏ కమిషన్ జనార్దన్ రెడ్డి అమెరికా పర్యటన

హెచ్‌ఎండీఏ కమిషనర్‌ బి. జనార్దన్‌ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ప్రధానమంత్రి ఎక్సలెన్స్‌ అవార్డును అందుకున్న జనార్దన్‌రెడ్డి మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంటున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ నోబెల్‌ బహుమతి గ్రహీతలతో జనార్దన్‌రెడ్డి సమావేశమవ్వనున్నారు. ఈ నెల 14 నుంచి 18 వరకు అమెరికా నార్త్‌ కరోలినాలోని డ్యూక్‌ వర్సిటీలో జరిగే సదస్సుకు దేశవ్యాప్తంగా ఎంపికైన ఐఏఎస్‌ అధికారుల బృందంలో హెచ్‌ఎండీఏ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి ఉన్నారు. ఈ ప్రతిష్ఠాత్మకమైన సదస్సుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చెందిన జనార్దన్‌రెడ్డిని ఎంపిక చేసింది. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా అనేక సరికొత్త పద్ధతులను జీహెచ్‌ఎంసీలో అమలు చేయడలో అప్పటి బల్దియా కమిషనర్‌గా జనార్దన్‌రెడ్డి ప్రముఖపాత్ర  పోషించారు. జానార్దన్‌రెడ్డి చేపట్టిన పలు కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసించి ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డు అందించిన విషయం విదితమే.