ప్రభుత్వానికి వానప్రస్థాశ్రమ విరాళం

ప్రభుత్వానికి వానప్రస్థాశ్రమ విరాళం

11-01-2019

ప్రభుత్వానికి వానప్రస్థాశ్రమ విరాళం

యాదాద్రి భువనగిరి జిల్లా పెద్ద కొండూరు గ్రామంలో నిర్మించిన వానప్రస్థాశ్రమాన్ని ప్రభుత్వానికి డొనేట్ చేసేందుకు ముందుకు వచ్చారు ఆశ్రమ నిర్మాతలు మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి మరియు  ఇవ్వాళ తెలంగాణ భవన్ లో కలిసి పూర్తి వివరాలు అందించారు. ఎకరంన్నర భూమిలో దాదాపు ఆరు వేల చదరపు అడుగుల భవనాన్ని సొంత ఖర్చులతో నిర్మించామని, అనారోగ్యం రీత్యా భవనంతో పాటు పూర్తి ఆశ్రమాన్ని ప్రభుత్వానికి విరాళం ఇస్తున్నామని. ఈ ఆశ్రమం ద్వరా వానప్రస్థాశ్రమాన్ని  కు సేవలు కొనసాగేలా చూడాలని వారు కేటీఆర్ ని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ తో మాట్లాడతారని, మీరు ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగించేలా ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందేలా చూస్తామని దంపతులకు కేటీఆర్ హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ తో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా దంపతుల సేవా దృక్పథాన్ని, దాతృత్వాన్ని కేటీఆర్ కొనియాడారు.