స్టాలిన్ తో సమావేశమైన సీఎం కేసీఆర్

స్టాలిన్ తో సమావేశమైన సీఎం కేసీఆర్

13-05-2019

స్టాలిన్ తో సమావేశమైన సీఎం కేసీఆర్

డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. చెన్నైలోని అళ్వార్‌పేటలో స్టాలిన్‌ నివాసానికి ఆయన వెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్టాలిన్‌ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు సమావేశమయ్యారు. సమాఖ్య కూటమి బలోపేతానికి సహకరించాల్సిందిగా స్టాలిన్‌ కేసీఆర్‌ కోరినట్లు తెలుస్తోంది. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల సహకారంతో కేంద్రంలో కాంగ్రెస్‌, బీజేపీయేతర ప్రభుత్వాలు కేంద్రంలో అధికారంలోకి రావాలంటూ గత కొద్ది రోజులుగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎంపీలు దురైమురుగన్‌, టీఆర్‌ బాలు, టీఆర్‌ఎస్‌  ఎంపీలు వినోద్‌ కుమార్‌, సంతోశ్‌ కుమార్‌ పాల్గొన్నారు.