హైకోర్టు న్యాయమూర్తిగా శ్రీదేవి ప్రమాణం

హైకోర్టు న్యాయమూర్తిగా శ్రీదేవి ప్రమాణం

16-05-2019

హైకోర్టు న్యాయమూర్తిగా శ్రీదేవి ప్రమాణం

తెలంగాణ హైకోర్టు తొలి మహిళా అదనపు న్యాయమూర్తిగా జస్టిస్‌ గండికోట శ్రీదేవి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ ప్రమాణం చేయించారు. అలహాబాద్‌ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ శ్రీదేవి తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చిన విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన ఆమె ఆలిండియా కోటా కింద ఉత్తరప్రదేశ్‌ జ్యూడిషియల్‌ సర్వీసుకు ఎంపికై, అలహాబాద్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆమె అభ్యర్థన మేరకు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్‌లు, న్యాయవాదులు పాల్గొన్నారు. హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ సభ్యులు జస్టిస్‌ శ్రీదేవికి అభినందనలు తెలిపారు.