హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు

హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు

17-05-2019

హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు

 ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్‌ వేదిక కాబోతుంది. ఇండస్ట్రియల్‌ డిజైన్లను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రెండేళ్లకోసారి నిర్వహించే వరల్డ్‌ డిజైన్‌ అసెంబ్లీ-2019 సదస్సును అక్టోబరు 11, 12 తేదీల్లో ఇక్కడ నిర్వహించనున్నారు. సదస్సు నిర్వహణకు వివిధ దేశాల్లోని అనేక నగరాలు పోటీ పడగా...హైదరాబాద్‌ను ఎంపిక చేశారని పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. సదస్సు ద్వారా ఇండస్ట్రియల్‌ డిజైన్ల రంగంలో వస్తున్న మార్పులు, భవిష్యత్తు అవకాశాలను తెలుసుకునే అవకాశం లభిస్తుందని, ఇది రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతిష్ఠాత్మక సదస్సుకు నగరం ఆతిథ్యం ఇవ్వనుండటంపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.