ఆ మూడు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయొద్దు

ఆ మూడు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయొద్దు

17-05-2019

ఆ మూడు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయొద్దు

తమ సభ్యత్వాల రద్దును ప్రశ్నిస్తూ మాజీ ఎమ్మెల్సీలు కె.యాదవరెడ్డి, భూపతిరెడ్డి, రాములు నాయక్‌లు విడివిడిగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జూన్‌ 3కు వాయిదాపడింది. ఈ వ్యాజ్యాలపై వాదనలు వినిపించేందుకు గడువు ఇవ్వాలని శాసనమండలి తరపు న్యాయవాది కోరడంతో ధర్మాసనం అనుమతించింది. అయితే తదుపరి ఉత్తర్వులిచ్చే వరకూ ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం జూన్‌ 3వరకు పొడిగించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ఏసీజే చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.