కాంగ్రెస్‌కు 220 సీట్లు వచ్చే ఛాన్స్‌

కాంగ్రెస్‌కు 220 సీట్లు వచ్చే ఛాన్స్‌

18-05-2019

కాంగ్రెస్‌కు 220 సీట్లు వచ్చే ఛాన్స్‌

కాంగ్రెస్‌కు 220 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, రాహుల్‌ గాంధీ ప్రధాన మంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పారు. కేసీఆర్‌ గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ సహా అన్ని పార్టీల మద్దతు కాంగ్రెస్‌ తీసుకుంటుందని తెలిపారు. అయినా తెలంగాణలో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్‌ కైవసం చేసుకుంటుందని పేర్కొన్నారు. మోదీని ప్రశ్నలు అడిగితే అమిత్‌ షా సమాధానమిస్తున్నారన్నారు. చివరి విడతలో రాజకీయ లబ్ది పొందేందుకే మోదీ ప్రయత్నం చేశారని ఆరోపించారు. మోదీ మాటతీరు, రాహుల్‌ మాట తీరకు చాలా తేడా ఉందని సృష్టం చేశారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి తాను లక్ష ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నానని రవి వ్యాఖ్యానించారు.