బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం

బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం

18-05-2019

బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్‌లో సంచలనం సృష్టించిన బాలికల హత్యోదంతం ఘటనను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించాలని చూస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ ఆరోపించారు. బాధిత కుటుంబాలను పరామర్శించాలనే విజ్ఞత కూడా ప్రభుత్వానికి లేదన్నారు. హాజీపూర్‌ బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. తాము ఏ వినతిపత్రం ఇచ్చిన గవర్నర్‌ దాన్ని చెత్తబుట్టలో వేస్తున్నారని విమర్శించారు. హాజీపూర్‌ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని సృష్టం చేశారు.