యాదాద్రి భవన్ ప్రారంభోత్సవం

యాదాద్రి భవన్ ప్రారంభోత్సవం

14-06-2019

యాదాద్రి భవన్ ప్రారంభోత్సవం

హైదరాబాద్‌లోని బర్కత్‌పూరాలో రూ.8కోట్ల వ్యయంతో నిర్మించిన యాదాద్రి భవన్‌ను రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ప్రభుత్వ సలహాదారు రమణాచారి పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యాదాద్రి ఆలయ సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి భవన్‌ను నిర్మించింది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించిన అర్జిత సేవలు, కల్యాణం, గదులు బుకింగ్‌ చేసుకునే సదుపాయాన్ని యాదాద్రి సేవాభవన్‌లో కల్పించారు.