కొన్నె లో అమెరికా అధ్యక్షుడి విగ్రహావిష్కరణ

కొన్నె లో అమెరికా అధ్యక్షుడి విగ్రహావిష్కరణ

15-06-2019

కొన్నె లో అమెరికా అధ్యక్షుడి విగ్రహావిష్కరణ

డొనాల్డ్‌ ట్రంప్‌ పరిచయం అక్కరనేని వ్యక్తి. అమెరికా దేశ అధ్యక్షుడిగా ఆయన అందరికీ సుపరిచితుడు. శుక్రవారం ట్రంప్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుస్సా కృష్ణ. ఏకంగా తన ఇంటి ఎదుటే ట్రంప్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మూడేళ్లుగా ట్రంప్‌ ను తాను ఆరాధిస్తున్నట్లు, ఆలయంలో దేవుడికి పూజలు చేసినట్టే ట్రంప్‌ ఫొటోకు పూజలు చేస్తున్నట్లు తెలిపారు. ఏటా ట్రంప్‌ జన్మదినం రోజున అన్నదానం చేస్తున్నట్లు వివరించారు. ఏదో ఒకరోజు ట్రంప్‌ను కలుస్తాననే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.