బీజేపీలోకి మాజీ ఎంపీ వివేక్?

బీజేపీలోకి మాజీ ఎంపీ వివేక్?

17-06-2019

బీజేపీలోకి మాజీ ఎంపీ వివేక్?

పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేరాలంటూ బీజేపీ నుంచి ఆయనకు ఆహ్వానం వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు 15 రోజులుగా బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వంతో వివేక్‌ చర్చలు కొనసాగుతున్నాయి. బీజేపీలో చేరితే ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశమిస్తారని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ నుంచి పెద్దపల్లి టికెట్‌ ఆశించినా వివేక్‌కు ఇవ్వలేదు. దాంతో ఆయన ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేయడంతోపాటు టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. అప్పట్లో పెద్దపల్లి లోక్‌సభ టికెట్‌ను ఆయనకు ఇవ్వడానికి బీజేపీ సిద్దమైంది. కానీ, ఎన్నికలకు సమయం తక్కువ ఉండడంతో పాటు ఇతర కారణాల వల్ల ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంతో బీజేపీ నేతలతో మరోసారి చర్చలు కొనసాగుతున్నాయి. వివేక్‌తోపాటు ఆయన సోదరుడు, మాజీ మంత్రి వినోద్‌, వారి అనుచరులు బీజేపీలో చేరే అవకాశం ఉంది.