ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్యార్టర్స్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్యార్టర్స్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

17-06-2019

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్యార్టర్స్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సభ్యుల కోసం హైదర్‌గూడలో నిర్మించిన నివాస సముదాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ క్యార్టర్స్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలించారు. 120 మంది చట్టసభల ప్రజాప్రతినిధులు నివాసం ఉండేలా 4.26 ఎకరాల స్థలంలో రూ.166 కోట్లతో నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఫ్లోర్‌లో పదిచొప్పున 12 అంతస్తుల్లో 120 క్యార్టర్స్‌ను నిర్మించారు. ఒక్కో క్వార్టర్‌ను మూడు బెడ్‌రూంలతో 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంతో.. మొత్తం 6 లక్షల చదరపు అడుగల నిర్మాణం చేపట్టారు. వీటికి అనుబంధంగా 325 చదరపు అడుగుల చొప్పున 120 సర్వెంట్‌ క్యార్టర్స్‌ను, సిబ్బందికి 36 క్యార్టర్స్‌ ఉన్నాయి. ఒక్కో సభ్యుడికి రెండుకార్లకు అవసరమైన పార్కింగ్‌ స్థలాన్ని కేటాయించాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌లో 23 సమావేశ క్యాబిన్లను కూడా ఏర్పాటు చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలను కలువడానికి వీలుగా వీటిని నిర్మించారు.