ఫ్లోరోసిస్ బాధితురాలికి ఎన్ఆర్ఐల ప్రోత్సాహం

ఫ్లోరోసిస్ బాధితురాలికి ఎన్ఆర్ఐల ప్రోత్సాహం

18-06-2019

ఫ్లోరోసిస్ బాధితురాలికి ఎన్ఆర్ఐల ప్రోత్సాహం

ఫ్లోరోసిస్‌ బాధితురాలని ప్రోత్సహించడానికి ఎన్‌ఆర్‌ఐలు ముందుకొచ్చారు. ఆమె వేసిన పెయింటింగ్‌లను గతంలో ఎన్‌ఆర్‌ఐలు అధిక ధరలకు కొనుగోలు చేశారు. అందులో కేటీఆర్‌, కేసీఆర్‌, కవిత హరీష్‌రావులకు సంబంధించిన పెయింటింగ్‌లు ఉన్నాయి. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం సాయిబండ తండాకు చెందిన సువర్ణ ఫ్లోరోసిస్‌ బాధితురాలు. ఆమె కూర్చున్న నోట నుంచి కాలు కదపలేని పరిస్థితుల్లో ఉంది. అయితే ఆమెకు చిన్నప్పటి నుంచి పెయింటింగ్‌పై మక్కువ ఉండడంతో వారి కుటుంబ సభ్యులు ఆమెను ఆ దిశగా ప్రోత్సహించారు.

గతంలో ఆమె వేసిన పలు పెయింటింగ్‌లను చూసిన ఎన్‌ఆర్‌ఐ జలగం సుధీర్‌ వాటిని ఫేస్‌బుక్‌లో పెట్టడంతో పాటు ఎన్‌ఆర్‌ఐల వాట్సప్‌లకు షేర్‌ చేశారు. దీంతో ఆమెను ప్రోత్సహించడంతో పాటు ఆమెకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో పలువురు ఎన్‌ఆర్‌ఐలు ఆమె చేసిన పెయింటింగ్‌లను కొనుగోలు చేస్తున్నారు. గతంలో సువర్ణ వేసిన కేటీఆర్‌, కేసీఆర్‌, కవిత, హరీష్‌రావు లకు సంబంధించిన పెయింటింగ్‌లను అధిక ధరలకు ఎన్‌ఆర్‌ఐలు కొనుగోలు చేయడం విశేషం. ప్రస్తుతం నల్లగొండ జిల్లాకు చెందిన ఎన్‌ఆర్‌ఐకు సక్రునాయక్‌ సువర్ణ వేసిన జానపద కళాకారిణి పెయింటింగ్‌ను కొనుగోలు చేశారు. భవిష్యత్‌లో సువర్ణతో మరిన్ని పెయింటింగ్‌లు వేయించి, ఆమె భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తామని జలగం సుధీర్‌, సక్రునాయక్‌ (ఎన్‌ఆర్‌ఐ)లు తెలిపారు.