ప్రపంచ స్కాట్‌ జంబోరీకి తెలంగాణ ప్రాతినిధ్యం

ప్రపంచ స్కాట్‌ జంబోరీకి తెలంగాణ ప్రాతినిధ్యం

16-07-2019

ప్రపంచ స్కాట్‌ జంబోరీకి తెలంగాణ ప్రాతినిధ్యం

అమెరికాలోని వెస్ట్‌వర్జీనియాలో ఈ నెల 22 నుంచి ఆగస్టు 2 వరకు జరిగే ప్రపంచ స్కాట్‌ జంబోరి-2019కి భారత స్కాట్స్‌ అండ్‌ గైడ్స్‌ తెలంగాణ రాష్ట్రశాఖ సంయుక్త కార్యదర్శి మంచాల వరలక్ష్మి హాజరవుతున్నారు. అంతర్జాతీయ సేవా బృందం (ఐఎస్టీ)సభ్యురాలిగా ఈమె ప్రాతినిధ్యం వహించనున్నారు. రాష్ట్రశాఖ నుంచి ఐదుగురు ఎంపికైనా, అమెరికా వీసా అందని కారణంగా కేవలం వరలక్ష్మి ఒక్కరే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ ఉత్సవాల్లో

వెళ్తున్నందుకు సంతోషంగా ఉన్నదని అన్నారు. అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవితకు ధన్యవాదాలని తెలిపారు. జులై 17న వర్జీనియా నగరానికి బయలుదేరి వెళ్తున్నానని చెప్పారు.