బీజేపీలోకి నేనెందుకు వెళ్తా .. మోదీ ఉన్నారు

బీజేపీలోకి నేనెందుకు వెళ్తా .. మోదీ ఉన్నారు

16-07-2019

బీజేపీలోకి నేనెందుకు వెళ్తా ..  మోదీ ఉన్నారు

బీజేపీలోకి నేనెందుకు వెళ్తాను, అది బుర్రలేనివారు నాపై చేస్తున్న ప్రచారం అది అంటూ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి ఖండించారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఎంపీ రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారుతానన్న ప్రచారం నమ్మవద్దన్నారు. బీజేపీలో నాకు ఏం పనుంది. నరేంద్ర మోదీ ఉన్నారు కదా అన్నారు. తాను ప్రశ్నించే గొంతునని, అందుకే ప్రజలు తనను పార్లమెంట్‌కు పంపించారని తెలిపారు. తాను పార్లమెంట్‌లో ప్రజా సమ్యలపై ప్రశ్నిస్తానన్నారు.