యాదాద్రిలో సీఎం కేసీఆర్‌

యాదాద్రిలో సీఎం కేసీఆర్‌

17-08-2019

యాదాద్రిలో సీఎం కేసీఆర్‌

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రి చేరుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తొలుత బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండచుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడి నుంచి పెద్ద కోటపై నిర్మితమవుతున్న ఆలయ నగరిని పరిశీలించారు. తుదిదశకు చేరుకుంటున్న ఆలయ నిర్మాణాలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. యాదాద్రిలో తలపెట్టిన మహాసుదర్శన యాగం కోసం ముఖ్యమంత్రి స్థల పరిశీలన చేయనున్నట్లు సమాచారం. దాదాపు 100 ఎకరాలు అవసరమని భావిస్తున్న ముఖ్యమంత్రి అందుకు అనువైన ప్రాంతం గురించి చర్చించే అవకాశముంది. త్రిదండి చిన్నజీయర్‌ స్వామి సూచనల మేరకు యాగస్థల పరిశీలన చేయనున్నట్లు తెలుస్తోంది.