హైదరాబాద్‌ గ్లోబల్‌ డిజైన్‌ డెస్టినేషన్‌ కాబోతోంది

హైదరాబాద్‌ గ్లోబల్‌ డిజైన్‌ డెస్టినేషన్‌ కాబోతోంది

12-10-2019

హైదరాబాద్‌ గ్లోబల్‌ డిజైన్‌ డెస్టినేషన్‌ కాబోతోంది

హైదరాబాద్‌ గ్లోబల్‌ డిజైన్‌ డెస్టినేషన్‌ కాబోతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సృష్టం చేశారు. హెచ్‌ఐసీసీలో నిర్వహించిన వరల్డ్‌ డిజైన్‌ అసెంబ్లీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌లో తొలిసారి వరల్డ్‌ డిజైన్‌ అసెంబ్లీ సమావేశాలు జరగడం సంతోషంగా ఉంది. ఔత్సాహికులకు అన్ని విధాలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఐటీ రంగంలో బెంగళూరు కంటే హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్‌లో టీ-హబ్‌, టీ-వర్క్స్‌, ఇమేజ్‌ టవర్స్‌ నిర్మాణం జరుగుతుంది. తెలంగాణ టూరిజం వేగంగా అభివృద్ధి చెందుతుంది. నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తుంది. పద్మశ్రీ చింతకింది మల్లేషం తయారు చేసిన ఆసు యంత్రాలను చేనేత కళాకారులకు మంత్రి కేటీఆర్‌ అందజేశారు.