ఇంకా ఏపీఎస్‌ఆర్టీసీలోనే భయపడాల్సిన అవసరం లేదు

ఇంకా ఏపీఎస్‌ఆర్టీసీలోనే భయపడాల్సిన అవసరం లేదు

02-11-2019

ఇంకా ఏపీఎస్‌ఆర్టీసీలోనే భయపడాల్సిన అవసరం లేదు

తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఆర్టీసీ సమ్మె కొనసాగిస్తామని కార్మిక సంఘాల ఐకాస కన్వీకర్‌ అశ్వత్థామరెడ్డి సృష్టం చేశారు. ఆర్టీసీ విభజన జరగలేదని, తాము ఇంకా ఏపీఎస్‌ఆర్టీసీలోనే ఉన్నామని చెప్పారు. అందువల్ల ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది జరగదని, కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆర్టీసీ ఐకాస నేతలు, విపక్ష నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సమ్మె తదుపరి కార్యాచరణను ప్రకటించారు. రేపు (3న) అన్ని డిపోలు, గ్రామాల్లో ఆర్టీసీ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ నెల 4న రాజకీయ పార్టీలతో కలిసి డిపోల వద్ద దీక్షలు నిర్వహిస్తామని, 5న సడక్‌ బంద్‌, 6న డిపోల ముందు నిరసనలు, 9న ట్యాంక్‌బండ్‌పై దీక్షలు, నిరసనలు చేపడతామని వివరించారు. కేంద్రం ఇంకా ఆర్టీసీని విభజించలేదని, ఈ నెల 4న లేదా 5న ఢిల్లీ వెళ్లి ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరతామని తెలిపారు.